Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం మధ్యాహ్నాం సచివాలయంలో ఆ శాఖ అధికారులు, సిబ్బంది మధ్య ఛార్జీ తీసుకున్నారు. ఈసందర్భంగా సచివాలయ సంఘం, వీఆర్వో,వీఆర్ఏ సంఘాల ప్రతినిధులు నవీన్‌మిట్టల్‌ను కలిసి అభినందనలు తెలిపారు. దీర్ఘకాలికంగా సీసీఎల్ఏకు పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో ఆ శాఖలో కొంత స్థబ్దత నెలకొంది. ఇప్పటిదాకా సాంకేతిక విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శిగా ఇంటర్ బోర్డుకు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. నవీన్‌మిట్టల్ ఏ శాఖలో పనిచేసినా, ఆ శాఖలో సంస్కరణలు ప్రవేశపెట్టి పనితీరు మెరుగుపరుస్తారనే పేరుందని ఆయా సంఘాల ప్రతినిధులు అభిప్రాయడుతున్నారు. గత నాలుగేండ్లుగా ఇటు రెవెన్యూ శాఖ, అటు సీసీఎల్ఏలోనూ ఉన్నతస్థాయిలో అధికారులు లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయనే వ్యాఖ్యానాలు రెవెన్యూ శాఖలో వినిపిస్తున్నాయి. అలాగే ధరణి ఇప్పటికీ బాలారిష్టాలను ఎదుర్కొంటున్న విషయమూ విదితమే. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖలోనూ సమస్యలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో నవీన్‌మిట్టల్ రావడం మంచి పరిణామమని ఆ శాఖ ఉద్యోగులు చెబుతుండటం గమనార్హం.