Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణ (పీఆర్సీ)ను సాధ్యమైనంత త్వరగా చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ జేఏసీ యాజమాన్యాన్ని కోరింది. బుధవారంనాడిక్కడి విద్యుత్ సౌధలో జేఏసీ చైర్మెన్ కోడూరి ప్రకాష్, కన్వీనర్ ఎన్ శివాజీ, కో కన్వీనర్ కేవీ జాన్సన్, సభ్యులు రామేశ్వరయ్య శెట్టి తదితరులు టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకర్‌తో భేటీ అయ్యారు. పీఆర్సీపై చర్చించారు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు మార్పు, ఆర్టిజన్స్ మాస్టర్ స్కేలు, పర్సనల్ పే తదితర అంశాలపై మాట్లాడారు. అలాగే క్రింది స్థాయి ఉద్యోగుల జీతభత్యాల వ్యత్యాసాన్ని కూడా సరిచేయాలని చెప్పారు.ఉద్యోగులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. పై అంశాలన్నింటినీ సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్ళి చర్చిస్తానని ఈ సందర్భంగా ప్రభాకరరావు తెలిపారు.