Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన పలు సంఘాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశాల ఐక్య వేదిక ఏర్పాటులో భాగంగా బుధవారం ఆ సంస్థలోని పలు కార్మిక సంఘాలు భేటీ అయ్యాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎమ్‌యూ) ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో ఆ సంఘం గౌరవాధ్యక్షులు అశ్వత్థామరెడ్డి, అధ్యక్షులు వీ తిరుపతి, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి, ఎన్‌ఎమ్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పీ కమాల్‌రెడ్డి, టీజేఎమ్‌యూ ముఖ్య సలహాదారు కృష్ణ, బీకేయూ అధ్యక్షులు ఆంజనేయగౌడ్, కార్మికసంఫ్ు ప్రధాన కార్యదర్శి స్వామికుమార్ పాల్గొన్నారు. ఆర్టీసీలో కార్మికులపై పెరుగుతున్న పనిభారం, అద్దె బస్సులు పెంచి కన్సల్టెన్సీలు, ఔట్సోర్సింగ్ కంపెనీలను ప్రవేశపెడుతూ కామధేనువు లాంటి ఆర్టీసీ ట్రావెల్ ఏజన్సీ స్థాయికి దిగజర్చుతున్న వైనంపై చర్చించినట్టు నాయకులు తెలిపారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి విశాల ఐక్యవేదిక ఏర్పాటు ఆవశ్యకత ఉన్నదని సమావేశం అభిప్రాయ పడినట్టు చెప్పారు. ఈనెల 11న మరోసారి టీఎమ్‌యూ కార్యాల యంలో మరో సారి భేటీ అవ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి హాజరుకాలేని సంఘాలు 11వ తేదీ భేటీలో పాల్గొనాలనీ, ఆ మేరకు ఆహ్వానాలు పంపుతామని టీఎమ్‌యూ అధ్యక్షులు వీ తిరుపతి చెప్పారు.