Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తల్లీ కౌసల్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. బుధవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో టీడీపీ శ్రేణులు, ముదిరాజ్ మహాసభ కార్యకర్తలు, కాసాని అభిమానులు భారీసంఖ్యలో తరలిరాగా మధ్యాహ్నాం ఒంటిగంటకు అంత్యక్రియలు జరిగాయి. కాసానితోపాటు టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కిన నర్సింహులు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కె.ఎం ప్రతాప్, మాజీ ఎంపీలు మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేతలు నన్నూరి నర్సిరెడ్డి, జ్యోత్స్న తదితరులు బౌతికకాయానికి నివాళులు అర్పించారు.