Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలివ్వాలి
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-కోదాడరూరల్
నిరుపేదలకు ఇండ్లు, స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కోసం ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 9న హైదరాబాద్లో నిర్వహించనున్న మహాధర్నాకు వేలాదిగా ప్రజలు తరలిరావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో పేదలు వేసుకున్న గుడిసెలను బుధవారం ఆమె సందర్శించారు. పేదల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇండ్ల్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేసి పట్టాహక్కులిచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. కొనుగోలు చేసిన స్థలాలకు పొజీషన్ చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేండ్లుగా గుడిసెలు వేసుకొని నివాసముంటున్న పేదలందరికీ పట్టా హక్కులు కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 30 ఏండ్ల కింద పేదల ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూముల్లో ఇప్పుడు పల్లె ప్రకృతివనం, రైతువేదికలు నిర్మించడం సరికాదన్నారు. అనేక గ్రామాల్లో పేద ప్రజలకు ఇంటి స్థలాలు లేక ఒకే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాల్లో పట్టా హక్కులు కల్పించి ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. సొంత స్థలం ఉన్న ప్రతి పేదవాడికీ రూ.5 లక్షలు మంజూరు చేసి సొంతింటి కలను నెరవేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెలిది పద్మావతి, సోమపంగు జానయ్య, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్, గుడిసెవాసుల సంఘం నాయకులు జిల్లాబోసు, రంజాన్బీ, లక్ష్మణ్, బేబీ తదితరులు పాల్గొన్నారు.