Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12న పాలకుర్తి నుంచి పాదయాత్ర
- 28న ఇందిరాపార్కు వద్ద ముగింపు
- జిల్లా కేంద్రాల్లో ఉపపాదయాత్రలు...
- కలెక్టర్లకు వినతిపత్రాలు : గ్రామపంచాయతీ ఎంప్లాయిన్ అండ్ వర్కర్స్
- యూనియర్ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం పోరాటాల పురిటి గడ్డ, వీరనారి చిట్యాల ఐలమ్మ స్వగ్రామమైన పాలకుర్తి నుంచి ఈనెల 12న పాదయాత్రను చేపట్టనునున్నామని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్ తెలిపారు. 15 రోజులపాటు కొనసాగనున్న పాద యాత్ర (300కిలోమీటర్లు) జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లా మీదుగా హైదరాబాద్కు చేరుకుంటుందని చెప్పారు. ముగింపు సందర్భంగా ఇందిరాపార్కు వద్ద సభ నిర్వహిస్తామన్నారు. ఇదే క్రమంలో ఆయా జిల్లా కేంద్రాల్లో ఉపపాదయాత్రలు చేపట్టాలనీ, కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చారు. తన నేతృత్వంలోని పాదయాత్ర బృందంలో యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు గ్యార పాండు, చాగంటి వెంకటయ్య, కార్యని ర్వాహక అధ్యక్షులు పి గణపతిరెడ్డి, రాష్ట్ర కార్య దర్శులు తునికి మహేష్, పి వినోద్ ఉంటారని తెలి పారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందుకు సంబంధించిన పోస్టర్, కరపత్రాన్ని రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగులేబర్ కోడ్లు, కనీస వేతనం రూ. 26వేలు, ఉద్యోగాలు పర్మినెంట్, వేతనాలు పెంపుదల, కారోబార్లకు స్పెషల్ స్టేటస్, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలనే అంశాలపై నిలదీస్తామన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందిలో అత్యధికులు దళితులు, గిరిజనులు, బలహీనవర్గా లకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. అందుకే రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత నియోజకవర్గం పాలకుర్తి కేంద్రంగా పాదయాత్రను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. పాలకులు మారినా వారి బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యంత నిర్లక్ష్యానికి, నిరాదర ణకు గురవుతున్నారని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్మికులు సుదీర్ఘకాలం పోరాటం చేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ప్రాతిపదిక లేకుండా అశాస్త్రీ యంగా జీవో నెంబర్ 51 తెచ్చిం దన్నారు. 500 జనాభాకు ఒక్క కార్మికుడు చొప్పున లెక్కించి వేత నాన్ని రూ 8,500 నిర్ణయించి చేతులు దులుపుకుం దని తెలిపారు. అదనంగా ఉన్న కార్మికు లకు ఎలాం టి వేతనాలు చెల్లించడం లేదనీ, ఒక కార్మికుడికి ఇచ్చే వేతనాన్ని అక్కడ పని చేసే కార్మికులందరూ పంచు కుంటున్నారని వివరించారు. ఫలితంగా రూ 3, 500 నుంచి రూ 4,500 వరకే వేతనాలు పొందు తున్నారని చెప్పారు.
డిమాండ్లు
- కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
- మోడీ నిర్ణయించిన వేతనం రోజుకు రూ 178 మాకొద్దు.కనీస వేతనం నెలకు రూ 26వేలుగా నిర్ణయించాలి.
- జీవోనెం 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రూ 16,500 ,కారోబార్,బిల్ కలెక్టర్లకు రూ 19,500, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ 22, 750 వేతనాన్ని చెల్లించాలి.
- చట్టం ప్రకారం పంచాయతీ సిబ్బంది అందరిని పర్మినెంట్ చేయాలి.
- కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి. వారిని అసిస్టెంట్ కార్యదర్శులుగా నియమించి ప్రభుత్వ గ్రాంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి.
- ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాదబీమా సౌకర్యాలు అమలు చేయాలి.
- పంచాయతీ కార్మికులందరికీ డబుల్బెడ్రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5.50 లక్షలు ఆర్థిక సాయం చేయాలి.
- దళిత బంధు పథకంలో పంచాయతీ సిబ్బందికి ప్రాధాన్యతనిచ్చి అమలు చేయాలి.