Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. విభజన హామీలను పక్కన పెట్టింది. రాష్ట్రం కోరే విన్నపాలు విస్మరణకు గురయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన విశ్వవిద్యాలయాలు రెండింటికి కలిపి కేవలం రూ.37.67 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లోని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ జాతీయ సంస్థకు రూ.115 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లోని ఐఐటీకి రూ.300 కోట్లును లోన్ కింద ఇవ్వనున్నారు. గత బడ్జెట్లో సింగరేణికి రూ.2 వేల కోట్లు కేటాయించారు. ఈ సారి బడ్జెట్లో కోత విధించారు. రూ.1650 కోట్లును కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియాలకు కలిసి కేవలం రూ. 357 కోట్లను కేటాయించారు.
కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ. 21 వేల కోట్లు
కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ.21,470.84 (2.102 శాతం) కోట్ల వాటా రానుంది. అందులో కార్పొరేషన్ పన్ను రూ.6,872.08 కోట్లు, ఆదాయపు పన్ను రూ.6,685.61 కోట్లు, సంపద పన్ను రూ. -0.18 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.6,942.66 కోట్లు, కస్టమ్స్ రూ.681.10 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.285.26 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.4.31 కోట్లు రాష్ట్రానికి రానున్నాయి.