Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా వ్యకాస, కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన
- బడ్జెట్ ప్రతుల దహనం
నవతెలంగాణ - విలేకరులు
కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి నిధుల తగ్గింపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో గురువారం బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరమూ బడ్జెట్లో ఉపాధి హామీ నిధులకు కోత పెడుతున్నదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బడ్జెట్ కంటే ఈసారి తక్కువ నిధులు కేటాయించిందని విమర్శించారు. దీనివల్ల ఉపాధి హామీ కూలీలకు పని దొరికే పరిస్థితులు ఉండవన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. నూతనకల్ మండలంలోని చిల్పకుంటలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.
ఖమ్మం పట్టణంలోని పాత బస్టాండ్ ఎదుట బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఖమ్మంలోని నిర్మల స్కూల్ వద్ద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. ఈ సందర్భంగా పొన్నం వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ మాట్లాడారు. డీవైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సరిత క్లినిక్ సెంటర్లో బడ్జెట్ ప్రతులు దహనం చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు చోట్ల వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా రంగానికి నిధులు పెంచలేదనిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో బడ్జెట్ పత్రాల్ని దహనం చేశారు. చేసి నిరసన వ్యక్తం చేశారు. చేర్యాల మున్సిపల్ కేంద్రంలో వ్యకాస ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల మాణిక్యం, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి, వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షు లు నర్సింహులు, రాష్ట్ర నాయకులు శశిధర్, కొంగరి వెంకట్మావో పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి గత బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో తక్కువ కేటాయించారని, ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రను వ్యతిరేకిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డెర రామ్మూర్తి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.