Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 61 ఏండ్ల వరకు కొనసాగింపు : నవీన్ మిట్టల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈనెల నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల జీతాలను సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ ద్వారానే ప్రొసీడింగ్ చేసుకోవచ్చంటూ ఇంటర్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులను 61 ఏండ్ల వరకు కొనసాగించాలని తెలిపారు. ఈ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు టి హరీశ్‌రావు, పి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్‌కు టిగ్లా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం జంగయ్య, మాచర్ల రామకృష్ణగౌడ్, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం-475 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ ధన్యవాదాలు తెలిపారు.