Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోరు మెదపని బీజేపీ ఎంపీలు : కోలేటి దామోదర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా బీజేపీ ఎంపీలు నోరు మెదపడం లేదని తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్ చైర్మెన్ కోలేటి దామోదర్ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల ప్రస్తావన లేదనీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ తదితర హామీలను విస్మరించారని తెలిపారు.