Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్త్రీ, శిశు సంక్షేమానికి 0.5 శాతం మాత్రమే కేటాయించారనీ, మహిళలకు మేలు చేసే బడ్జెట్ కాదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళల భద్రత, హింసను నివారించటానికి నిధులు పెంచలేదనీ, క్రీడారంగంలో మహిళలకు నిధులు కేటాయించలేదేని తెలిపారు. మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులను సైతం కార్పోరేట్ సంస్థలకు మళ్ళిస్తున్నారని పేర్కొన్నారు. దీన్ దయాళ్ జాతీయ గ్రామీణ మిషన్‌కు 8.1 లక్షల పొదుపు గ్రూపులు అనుసంధానించారని తెలిపారు. దీన్ని ఇంకా అభివద్ధి పరిచి పెద్ద సంస్థగా రూపొందిస్తామని చెబుతున్నారని తెలిపారు.దీనివల్ల ప్రయివేటు సంస్థలే మహిళలకు రుణాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. వీటి నుండి మహిళలు తక్కువు వడ్డీకి రుణాలు పొందే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సమ్మున్ పొదుపు పథకాన్నే ప్రకటించారనీ, ఇది ఎక్కువ మొత్తంలో పొదుపు చేసుకునే కొద్ది మంది మహిళలకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించే ఆర్థిక పథకాలేవీ పెద్ద ఎత్తున అప్పుల్లో ఉన్న మహిళలకు వర్తించవనీ, దీంతో వారు ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలు, యమ్ఎస్ఐల ద్వారా ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకుని మరింత అప్పుల్లో కూరుకు పోతారని తెలిపారు. 80 కోట్ల కుటుంబాలను సీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా సంవత్సరం పాటు ఉచిత ఆహారం అందిస్థామని చెప్పిన ప్రభుత్వం, ఆహార సబ్సిడీని 31శాతానికి కుదించిందని పేర్కొన్నారు. రాజీవ్ గాందీ, మౌలాన ఆజాద్, ఫెలోషిప్‌లకు కేటాయింపులు పెంచలేదని తెలిపారు. ఇది మహిళల విద్యపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొ న్నారు. కార్పోరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే బడ్జెట్ ఇదనీ, మహిళలకు, వారి కుటుంబాలకు ఎటువంటి మేలు చేసేది కాదని విమర్శించారు.దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.