Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 59,909 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. దరఖాస్తుల్లో సవరణ ప్రక్రియను 13,710 మంది అభ్యర్థులు వినియోగించుకున్నారు. ఈ మేర కు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 3,649 మంది, నిజా మాబాద్లో 3,426 మంది, రంగారెడ్డి జిల్లాలో 3,256 మంది, సంగా రెడ్డిలో 3,202 మంది, ఖమ్మంలో 3,065 మంది, అత్యల్పంగా ములుగు జిల్లాలో 423 మంది, జయశంకర్ భూపాలపల్లిలో 546 మంది, హన్మ కొండలో 696 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారని వివరించారు.