Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఇద్దరు బిల్డర్ల పైనా కొనసాగిన సోదాలు
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
కోట్ల రూపాయల్లో ఆదాయపు పన్నును ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఆసు ్థలపై ఐటీ దాడులు గురువారం మూడో రోజూ కొనసా గాయి. దీంతో పాటు ముప్పా బిల్డర్స్, వర్టెక్స్ బిల్డర్స్, వసుధ ఫార్మాస్యూటికల్ కంపెనీ లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ముఖ్యంగా, వెంకట్రామిరెడ్డికి చెందిన రాజ్‌పుష్ప ప్రధాన కార్యాలయంతో పాటు ముప్పా బిల్డర్స్ కార్పొరేటు కార్యాలయంలో క్షుణ్ణంగా సోదాలు సాగాయి. మంగళవారం నాడు ప్రారంభమైన ఐటీ దాడుల్లో 50 మందికి పైగా ఐటీ అధికారులు పాల్గొనగా.. బుధ, గురువారాల్లో కొనసాగిన సోదాలలో మరికొందరు అధికారులు అదనంగా చేరారు. ముఖ్యంగా, ముప్పా బిల్డర్స్‌కు సంబంధించి సాగిన నిర్మాణాలు, గడించిన ఆదాయాలు, జరిపిన ఐటీ పన్ను చెల్లింపుల్లో భారీ ఎత్తున వ్యత్యాసాలు తేలినట్టు ఐటీ అధికారులు గుర్తించారని తెలిసింది. అలాగే, రాజ్‌పుష్ప, వసుధ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో సైతం పన్ను చెల్లింపు వ్యత్యాసాలు కోట్ల రూపాయల్లో ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. కార్పొరేటు సంస్థల కార్యాలయాల నుంచి వాటి ఆస్థులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, నూతనంగా నిర్మించిన విల్లాలు, వాటి విక్రయాలు సంబంధించిన పలు డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అంతేగాక, ఈ సంస్థల నుంచి ఇతర వ్యాపారాలలో సాగిన పెట్టుబడుల గురించి కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. నగర అదనపు పోలీసు కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్, నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ సుధీర్ బాబు లు సిటీ సెక్యూరిటి వింగ్‌కు చెందిన అధికారులతో కలిసి అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను గురువారం సమీక్షించారు.