Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైరాబాద్
మహారాష్ట్రకు చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు గురువారం బీఆర్ఎస్లో చేరారు. బోకర్ మండలం రాఠీ సర్పంచ్ మల్లేష్ పటేల్‌తో సహా 100 మంది మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకులు బామిని రాజన్న ఆద్వర్యంలో కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బామిని రాజన్న, మాజీ డీసీసీబీ చైర్మెన్ రాంకిషన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మెన్ లోలం శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.