Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాకాటి కరుణకు టీపీటీఎల్ఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు టీచర్లు, లెక్చరర్లను రిజిస్టర్ చేసి గుర్తింపు కార్డులివ్వాలనీ, వారి సమస్యలను పరి ష్కరించాలని తెలంగాణ ప్రయివేటు టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లో ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి అరుణకు ఆ ఫెడరే షన్ నాయకులు వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా టీపీ టీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఎ.విజరు కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 11వేలకు పైగా ప్రయవేటు పాఠశాలలుండగా అందులో 4 లక్షల మంది వరకు టీచర్లు పనిచేస్తున్నారని తెలి పారు. వారు 35లక్షల మంది విద్యార్థు లకు బోధన చేస్తున్నారని చెప్పారు. అయినా వారి సేవలకు సరైన గుర్తింపు దక్కడం లేదని వాపోయారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మెడి కల్, ఫార్మసీ, అగ్రి కల్చర్, ఫార్మా మెడికల్ కాలేజీలు అనేకం ఉన్నాయనీ, వాటిలో కూడా దాదాపు మరో నాలుగు లక్షల మంది పైగా లెక్చరర్లు చదువులు చెబుతున్నారని వివరిం చారు. వారి శ్రమకు కూడా గుర్తింపు దక్కట్లేదన్నారు. రాష్ట్రంలో ప్రయివేటు విద్యాసంస్థల్లోని టీచింగ్ ఫ్యాకల్టీనం తా రిజిస్ట్రేషన్ చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వారికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయా లని డిమాండ్ చేశారు. ప్రయివేటు టీచింగ్ స్టాఫ్‌కి బీమా, ఈఎస్ఐ, పీఎఫ్ అమ లయ్యేలా చూడాలన్నారు. ప్రయివేటు టీచర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మినిమం వేజ్ ప్రకారం తప్ప నిసరిగా జీతాలిచ్చే లా చర్యలు తీసుకో వాలన్నారు. విద్యా సంవత్సరం మధ్య లోనే టీచర్లను తీసేసే పద్ధతిని అరికట్టాలని కోరారు.