Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడ్కరిని కలిసిన ఎంపీ రవిచంద్ర
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం గుండా వెడుతున్న జాతీయ రహదారులపై నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గురువారం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఖమ్మం మీదుగా వెళ్లే నాగపూర్ - అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్ మెంటును ఖమ్మం కలెక్టరేట్ వద్ద మార్చాలని కోరారు. ప్రతిపాదిత హైవే మార్గం సమీకృత కలెక్టరేట్ మధ్య నుంచి వెడుతుందనీ, అది రాకపోకలకు అసౌకర్యంగా ఉండటంతో దానిని కలెక్టరేట్ వెనుక నుంచి వెళ్లేలా సవరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇదే హైవేపై ఖమ్మం, విజయవాడ మార్గం నుంచి వచ్చే వాహనాలు సూర్యాపేట సమీపాన కలిసే చోట, జాతీయ రహదారి నంబర్ 65 పై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట్ వద్ద కూడా వాహనదారులు,పాదాచారుల సౌకర్యార్థం అండర్ పాసులను ఏర్పాటు చేయాల్సిన అవసరం గుర్తించారు.ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.