Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ టీచర్ల ఫెడరేషన్ (టీఎస్ఎంఎస్టీఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను గురువారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పదేండ్లుగా ఒకేచోట పనిచేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలి పారు. బదిలీల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభు త్వ, మండల, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులతోపాటు మోడల్ స్కూల్ టీచర్లకు కూడా బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి కొండయ్య, ఎస్ మహేష్, కార్యదర్శి రంజిత్‌కుమార్, సాయిచరణ్, యాదగిరి, ఐలయ్య..తదితరులు పాల్గొన్నారు.