Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2023 - 24 బడ్జెట్లో కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం(కేజీకేఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లం కొండ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వీరికి ఎలాంటి ఆధారం లేదని పేర్కొన్నారు. ప్రమాదమని తెలిసి కూడా బతుకుతెరువు కోసం వృత్తిని చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది 550 మంది ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి జారి పడ్డారనీ, వీరిలో 90 మంది చనిపోయారని తెలిపారు.460 మంది వికలాంగులయ్యారని పేర్కొన్నారు.వీరికి ఎలాంటి రుణ సౌకర్యం కల్పించలేదని పేర్కొన్నారు. గత బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించినట్టు చెప్పి, ఒక్క పైసా ఖర్చు చేయలేదని గుర్తుచేశారు.