Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య కార్డుల సమస్యను పరిష్కరిస్తాం : హెచ్‌యూజే డైరీ ఆవిష్కరణలో మంత్రి హరీశ్‌రావు
- మంత్రులు సబిత, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలిస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య కార్డుల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయనీ, అందరికీ మేలు జరిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. హైదరాబాద్ యూనియన్ అఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే-టీడబ్ల్యూజేఎఫ్) నూతన సవంత్సరం డైరీని మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రుల దృష్టికి హెచ్‌యూజే నాయకులు తీసుకెళ్లారు. ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్టుల ఆరోగ్య కార్డులను పూర్తిస్థాయిలో అనుమతించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్‌యూజే అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బొల్లె జగదీశ్వర్, కోశాధికారి బి రాజశేఖర్, ఉపాధ్యక్షులు ఎం రమేష్, జాయింట్ సెక్రటరీ క్రాంతి, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.