Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ,బీసీ సంక్షేమ, పర్యాటక శాఖల ఉన్నతాధికారులతోపాటు గౌడ సంఘాల ప్రతినిధులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గురువారం పరిశీలించారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు తెలంగాణకు చెందిన వైతాళికుల చరిత్రను కనుమరుగు చేశారని తెలిపారు.తెలంగాణ వైతాళికులను, కవులను, కళాకారులను, చరిత్రకారులను, సామాజికవేత్తలను గౌరవించి వారి చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిసేలా వారి జయంతి, వర్ధింతులను అధికారికంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.