Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
- రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి పేరుతో పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్రస్టు సభ్యులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని సాగర్ హిల్స్‌లో 15 ఎకరాల్లో నిర్మిస్తున్న రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి వసతి గృహానికి గురువారం మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి వసతి గృహం నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు, 15 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు తెలిపారు. ఇక్కడ వసతి గృహంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాల్లో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. పేద పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి కృషి చేయాలని ట్రస్ట్ సభ్యులకు సూచించారు. వసతి గృహ నిర్మాణానికి తక్షణం రూ.5 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వసతి గృహ నిర్మాణంతోపాటు పక్కనే ఎకరా స్థలాన్ని రహదారి కోసం ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని చెప్పారు. రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో అభిమానం అన్నారు. పేద ప్రజలు చదువుకోవడానికి వసతి గృహాలు, కళాశాలలు కట్టించి ఎంతో మానవ తావాదిగా రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. ఆయన ఆశలకు అనుగుణంగా ట్రస్టు సభ్యులు పనిచేయాలని మంత్రి సూచించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి కళాశాలలో తాను కూడా చదువుకున్నానని చెప్పారు. అప్పట్లోనే బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం నిర్మించడం ద్వారా తనలాంటి వాళ్లు ఎం దరో అందులో చదువుకొని గొప్ప వాళ్లు అయ్యారని అన్నారు. ఈ సొసైటీకి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరో సానిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీ వాణిదేవి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంత్ రెడ్డి, ధనుంజయ పాల్గొన్నారు.