Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో ప్రజాశాంతి అధ్యక్షులు కేఏ పాల్ పిల్
నవతెలంగాణ -హైదరాబాద్
తెలంగాణ నూతన సచివాల యాన్ని కేసీఆర్ పుట్టినరోజైన ఈ నెల 17న ప్రారభించడాన్ని సవా లు చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షు లు కేఏ పాల్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఆయన పుట్టినరోజున కొత్త సచివాల యాన్ని ప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవడాన్ని తప్పు బట్టారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారనీ, అంబేద్కర్ పుట్టినరోజైన ఏప్రిల్ 14న ప్రారంభించాలని కోరా రు. ఈమేరకు రాష్ట్ర ప్రభు త్వానికి ఆదే శాలు ఇవ్వాలని సీఎంఓను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిల్లో చేర్చారు.
ఎంవీ యాక్ట్‌లో సవరణపై హైకోర్టు విచారణ
మోటార్ వెహికిల్ చట్టంలోని ఆరు మాసాల నిబంధన విధించడాన్ని సవాల్ చేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు విచారణ జరిపింది. రోడ్డు ప్రమాదం జరిగితే ఏడాదిలోగా దావా వేయాలన్న నిబంధనను ఆరు నెలలకు తగ్గించడం సరికాదని అభిప్రాయ పడింది. ఇదిప్రజలకు సంబంధించిన అంశమని పేర్కొంది. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం అమ్రాడ్ గ్రామానికి చెందిన అయిటి నవనీత అక్కడి కోర్టులో దావా వేశారు. ఆరు నెల్ల గడువు ముగియడంతో అక్కడి కోర్టు విచారణను నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీగా నియామకం అయిన న్యాయ వాది పి.శ్రీరఘురామ్ తన అభిప్రా యా కోర్టుకు నివేదించారు. 'పరిహారం పొందే హక్కును ఓ పౌర చట్టంగా పరిగణించాలన్నారు. దీనిపై హైకోర్టు .. ఇది ఈ ఒక్క కేసుకు సంబంధించిన అంశం కాదనీ, పెద్ద ఎత్తున ప్రజలతో ముడిపడిందని చెప్పింది. ప్రతివాదుల వాదనల నిమిత్తం విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
ఈసీఐఎల్ మాజీ ఉద్యోగులకు ఎదురదెబ్బ
ఈసీఐఎల్ యాజమాన్యానికి అందులో పనిచేసే ఉద్యోగుల సంఘా నికి మధ్య జరిగిన ఒప్పందంలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 2007 నుంచి పెన్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలను కల్పిం చాలని ఈసీఐఎల్ మాజీ ఉద్యోగుల వినతిని తోసిపుచ్చింది. 2009లో కుదిరిన ఒప్పందం ప్రకారం 2007లో రిటైర్ అయిన ఎగ్జిక్యూటీవ్లకు పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ మాజీ ఉద్యోగి సీహెచ్ నాగేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పి.మాధవీదేవి కొట్టేస్తూ తీర్పు వెలువరించారు.
ఒప్పంద అమలుకు చట్టబద్ధత లేనందున ఈ వ్యవహారం లో హైకోర్టు తన విచక్షణాధికారాన్ని వినియోగించలేదని చెప్పారు. ఈసీఐ ఎల్ లాభాల్లో ఉన్నందున ఇప్పుడు రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఇస్తున్నట్లు గా పెన్షన్ ఇవ్వాలని పిటిషనర్ వాదన. రిటైర్మెంట్ ప్రయోజనాలతో పాటు వైద్య సౌకర్యాల కల్పన ఉందనీ, పిటిషనర్ల వాదనను ఆమోదిస్తే సంస్థ మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుందని ఈసీఐఎల్ వాదించింది.
బైరి నరేష్ భద్రత కోసమే..
హైకోర్టుకు నివేదిక
మత మనోభావాల్ని దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టె జైల్లో ఉన్న జైరి నరేష్ భద్రత కోసమే పరిగి జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించినట్టుగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హైకోర్టుకు నివేదిక అందజేశారు. ఈ విషయం నరేష్‌కు తెలియదని చెప్పారు. నరేష్‌ను చర్లపల్లి జైల్లో ఏకాంతంగా నిర్బంధించడం హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని కోరుతూ అతని భార్య సుజాత హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. వాస్తవ పరిస్థితి పరిశీలించి నివేదిక ఇవ్వాలని జస్టిస్ విజరుసేన్‌రెడ్డి గత ఆదేశాలకు అనుగుణంగా కార్యదర్శి నివేదిక సమర్పించారు. జనవరి 30న జైలు సూపరింటెండెంట్, నరేష్‌లను విచారించినట్టు తెలిపారు. పరిగి జైల్లో భత్రద కష్టమని అక్కడి అధికారులు చెప్పడం వల్లే చర్లపల్లికి తరలించారనీ, విచారణ ఖైదీలు 20 మందితో నరేష్ ఉన్నాడనీ, 14 రోజులపాటు సెల్లోనే అన్నం పెట్టారనీ, ఇప్పుడు అందరి ఖైదీలతో కలిపి పెడుతున్నారని చెప్పారు. మానస సరోవర్ బ్యారక్‌లో ఉన్నాడనీ, ములాఖత్‌పై ఫిర్యాదులు ల్లేవనీ, వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారనీ, అదే బ్యారెక్‌లో రేప్,మర్డర్ కేసు నిందితుడు నాగేశ్వరరావు కూడా ఉన్నాడని తెలిపారు. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు, దానిపై వివరణ ఇవ్వాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
జప్తు సబబే-ఈడీ అప్పీల్
ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యుయల్స్లో జప్తు చేసి సీజ్ చేసిన నగలు, నగదు తిరిగి అప్పగించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డివిజన్ బెంచ్ వద్ద సవాల్ చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్‌భూయాన్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారించింది. ఆ కంపెనీ ప్రతినిధులకు బోగస్ కంపెనీలతో సంబంధాలు ఉన్నందున సింగిల్ జడ్జి ఆర్డర్ అమలును నిలిపివేయాలని ఈడీ కోరిన అప్పీల్పిటిషన్పై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.