Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాధ్ కన్నుమూత
- అనారోగ్యంతో చికిత్సపొందుతూ..
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె. విశ్వనాథ్ (92) ఇక లేరు. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం వంటి సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దశదిశలా చాటిన ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యం తో ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసి నట్టు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రజానీకం ఈ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. 1930 లో గుంటూరు జిల్లా పెదపులివర్రు గ్రామంలో విశ్వనాథ్ జన్మించారు. తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యా ల్లా నిలిచిపోయే దాదాపు 50 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. చిత్రరంగం మీద ఆసక్తితో చెన్నై వెళ్లిన ఆయన ఒక స్టూడియాలో సౌండ్ రికార్డు ఆర్టిస్టుగా సినీ జీవితాన్ని ఆరంభించారు. 1965లో ఆత్మగౌరవం సినిమాకు ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన చివరి సినిమా శుభప్రదం. 1992లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. 2016లో దాదాసా హెబ్ పురస్కారం అందుకున్నారు. ప్రముఖ నటుడు కమల్‌హాసన్ సూచనతో... విశ్వనాథ్ దర్శకత్వంతో పాటు నటనారంగంలోకి ప్రవేశించి.. కొన్ని వందల చిత్రాల్లో ఆయన నటించారు.