Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదం
- గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత...అడ్డగింత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అగ్ని ప్రమాదానికి గురైన నూతన సచివాలయాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. అటుగా వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని శుక్రవారం గాంధీభవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్ ఆవరణ నుంచి బయటకు వెళ్లకుండా బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులకు, నాయకులు వాగ్వాదం కొనసాగింది. తీవ్ర ఉద్sరికత్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ జన్మదినం రోజే సచివాలయాన్ని ప్రారంభించాలన్న ఒత్తిడితో ప్రభుత్వం ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు. అగ్నిప్రమాదంపై నిజనిర్ధారణకు అఖిలపక్ష బందాన్ని అనుమతించాలని డిమాండ్ చేశారు. మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి నాయకులు చామల కిరణ్ రెడ్డి, అనిల్ యాదవ్, నాయకులు దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, సుధీర్ రెడ్డి, మెట్టు సాయి కుమార్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.