Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంటలు వ్యాపించకుండా ఆర్పిన 11 అగ్నిమాపక యంత్రాలు
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర నూతన సచివాలయంలో శుక్రవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక భాగంలో మొదట ఈ మంటలు లేచినట్టు అగ్నిమాపక వర్గాలను బట్టి తెలిసింది. అక్కడ ఉన్న బెంచీలు, టేబుళ్లకు తొలుత మంటలు అంటుకున్నాయనీ, ఈ విషయమై వెంటనే అక్కడి సెక్యూరిటీ అధికారులు ఫైర్ సర్వీసులవారికి తెలియజేశారు. వెంటనే అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి మంటలు విస్తరించకుండా ఆర్పినట్టు తెలిసింది. దాదాపు 11 అగ్నిమాపక యంత్రాలు ఈ మంటలు ఆర్పేందుకు కృషి చేసినట్టు సమాచారం. ఈ ప్రమాదంతో ఏ మేరకు నష్టం జరిగిందనే విషయమై అధికారులు అంచనా వేస్తున్నట్టు తెలిసింది. ఇది చిన్నపాటి అగ్ని ప్రమాదమేననీ, అగ్నిమాపక శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటన గురించి తెలుసుకోవడానికి మీడియా సచివాలయానికి వెళ్లగా.. సెక్యూరిటీ అధికారులు లోనికి అనుమతించలేదు. కాగా ఈ ఘటనను మాక్ డ్రిల్గా అగ్నిమాపక శాఖాధికారులు తెలపగా.. ఇది చిన్నపాటి ఘటన అని సచివాలయం అధికారులు చెప్పారు.