Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020లో తాను ఎలాంటి పాంప్లెట్ ముద్రించలేదు
- దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
శాసనసభలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని, అధికారంలో ఉన్నవారికంటే ప్రజాశక్తి గొప్పది అనేది నాకన్నా కేటీఆర్ ఎక్కువ గుర్తుంచుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఆయన శనివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 2020 దుబ్బాక ఉప ఎన్నికల్లో తాను ఎటువంటి పాంప్లెట్నూ ముద్రించలేదని, సభలోకి తెచ్చిన పాంప్లెట్ 2018 సాధారణ ఎన్నికలప్పుడు ముద్రించిందని, దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. అదే సమయంలో 2014లో మీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. చేగుంటకు డిగ్రీ కాలేజ్.. దుబ్బాకకు రింగు రోడ్డు ఇవ్వాల్సింది ఎవరని ప్రశ్నించారు. 103మంది ఎమ్మెల్యేలు ఉన్నామని, అహంకారం పనికిరాదు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. నేను ఇచ్చిన మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉంటానని, తాము అధికారంలోకి వచ్చాక అమలు చేసి చూపిస్తానని చెప్పారు. హామీలు, నిధులపై అడిగితే కేటీఆర్ తెలంగాణ తొమ్మిదేండ్ల పసిగుడ్డు అంటున్నారని, అలాంటప్పుడు రెండేండ్ల పసిగుడ్డు అయిన తాను చేయడానికి కూడా సమయం పడుతుందన్నారు. రెండు నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదన్నారు. తమకూ సమయం వస్తుందని, తమరు ప్రతిపక్షంలో ఉన్నా మాట్లాడటానికి అవకాశం ఇస్తామని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పించుకొని పారిపోయారని ఎద్దేవా చేశారు. దుబ్బాక నియోజకవర్గానికి మీ బావతో కలిసిరా కేటీఆర్.. తప్పకుండా ప్రజలతో సమాధానం చెప్పిస్తానని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం, మోడీపై అనేక ఆరోపణలు చేశారని, అవకాశమిస్తే కచ్చితంగా సమాధానం చెప్తానని అన్నారు.