Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలు గేండ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసిన ఘట నపై హైకోర్టు సీరియస్ అయ్యింది. జీహెచ్ ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిం చింది. తీసుకున్న చర్యల గురించి చెప్పాలని ఆదేశించింది. బాలుడు ప్రదీప్‌ను కుక్కలు కరిచి చనిపోయిన ఘటన అధికారుల అంత రాత్మలను కదిలించలేదా? అని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వీధి కుక్కల నియంత్రణకు తీసుకునే చర్యలు వివరించాలంటూ ఆదేశించింది. మృతుడి తల్లి దండ్రులు పరిహారం చెల్లింపులకు అర్హుల ని, ఈ మేరకు తీసుకున్న చర్యలు వివరిం చాలని సూచించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్ర టరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలె క్టర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేస్తూ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురు వారం తీర్పు వెలువరించింది. నిజామా బాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గం గాధర్.. అంబర్‌పేటలోని ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో వాచ్‌మన్‌గా పని చేస్తూ జీవనో పాధి పొందుతున్నారు. తండ్రితో పాటు ఆదివా రం సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లిన నాలుగేండ్ల కుమారుడు ప్రదీప్‌పై వీధి కుక్కలు దాడి చేయ డంతో బాలుడు మరణించినట్టు వచ్చిన వార్తల ను హైకోర్టు సుమోటోగా విచారించింది.
ఆలేరు ఎమ్మెల్యేపై రిట్ డిస్మిస్
ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అక్రమ మార్గాల్లో డబ్బును సంపాధించారనీ, దీనిపై ఐటీ, ఈసీ చర్యలు తీసుకోవడం లేదంటూ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెంకు చెందిన బొడుదాసు మహేష్ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురువారం కొట్టేసింది. సునీతపై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలన్న పిటిషనర్ వినతిని తోసిపుచ్చింది. బ్లాక్మెయిల్లో భాగంగానే కొందరు ఇలాంటి పిటిషన్లు వేస్తుంటారని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తన కెరీర్‌పై శ్రద్ధ పెట్టుకోవాలని సూచించింది.