Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న బళ్లారి ఎక్స్‌ప్రెస్‌కు బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో వెంటనే రైల్వే రక్షక దళ, జీఆర్పీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి పోన్ చేసి ఈ విషయం చెప్పడంతో డాగ్ స్క్వాడ్,బాంబ్ స్క్వాడ్లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తనిఖీలు నిర్వహించిన అనంతరం బాంబు లేదని పోలీసులు నిర్దారించారు. ఆ తర్వాత రైలు బయలు దేరింది.