Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఎం పోషణ్ పోర్టల్‌లో తప్పకుండా ఆధార్ కార్డును అప్లోడ్ చేయాలంటూ కేంద్రం ఆదేశించటం దారుణమని ఎస్ఎఫ్ఐ పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి.నాగరాజు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటికీ అనేక వేల మంది వేలి ముద్రలు, బయోమెట్రిక్ సమస్యల వల్ల ఆధార్ కార్డును పొందలేకపోతున్నారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆధార్ లింక్‌ను మధ్యాహ్న భోజనానికి తప్పనిసరి చేస్తే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఆ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.