Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దుబాయ్లో కొనసాగుతున్న దుబారు కల్చరల్ ఫెస్ట్తో పాటు పలు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా బీసీరాజ్యాధికార సమితి బృందం శుక్రవారం బయలు దేరుతున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి ప్రవాస భారతీయులతో రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన అంశాలపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి గుల్ఫ్ దేశాలకు వలసపోయిన ప్రజలను, ముఖ్యంగా బీసలను ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలు, ప్రధాన డిమాండ్లను తెలుసుకోనున్నట్టు తెలిపారు.