Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసు దర్యాప్తులో ఆర్టీసీ జేడీ కీలకపాత్ర
- ఎండీ వీసీ సజ్జన్నార్ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పదహారు నెలల చిన్నారిపై లైంగిక దాడి కేసులో కొత్తగూడెం కో ర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో దోషికి 25 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించలేని పక్షంలో ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అదనంగా ఉం టుందని స్పష్టం చేసింది. అప్పటి భద్రాచలం ఏఏస్పీ, ప్రస్తుత టీఎస్ ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా కేసులో ఆధారాలను సేకరిం చారు. కోర్టు త్వరితగతిన ట్రయల్ నిర్వహించేలా చొరవచూపారు. 2018 జూన్‌లో భద్రాద్రి-కొత్త గూడెం జిల్లా దుమ్ముగూడెం మండ లానికి చెందిన 22 ఏండ్ల అజ్మీరా సాయికిరణ్ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ పాప తల్లిదండ్రులు శుభకార్యం కోసం వేరే ఊరు వెళ్లగా, అప్పుడు వారి బంధువు వద్ద ఉన్న పాపను ఆడిసా ్తనని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లిన సాయికిరణ్ లైంగిక దాడికి పాల్ప డ్డాడు. ఈ ఘటనపై దుమ్ముగూడెం పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో నిందితు డికి శిక్ష పడేలా పక డ్బందీగా కేసును దర్యాప్తు చేసిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ అభినందించారు. హైదరాబాద్ బస్‌భవన్‌లో గురువారం ఆయన్ను సన్మా నించారు. బాధిత కుటుంబా నికి త్వరత గతిన న్యాయం అందేలా చర్యలు తీసుకున్న పాటిల్‌ను ప్రశం సించారు. టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరే టింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్, వినోద్ కుమార్, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎం జీవన్ ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ (ఐటీ) రాజశేఖర్, సీటీఎం(ఎం అండ్ సీ) విజయ్ కుమార్, చీఫ్ మేనేజర్(ఫైనాన్స్) విజయ పుష్ఫ, పాల్గొన్నారు.