Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర పోలీసులు నేరాల అదుపు, విచారణలో మరింత సామర్థ్యాన్ని సాధించడానికి గాను అన్ని జిల్లాల్లో క్రైమ్ రికార్డు బ్యూరో (డీసీఆర్బీ)లను పటిష్ట పరుస్తామని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ గురువారం తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జరిగే నేరాలు, ఆ నేరాలకు కారణాలు, జరుగుతున్న తీరు తెన్నులు, నేరాలలో వస్తున్న మార్పులు, నేరస్తుల ఎత్తుగడల గురించి నేర నమోదు విభాగాలు మంచి విశ్లేషషణ జరిపి నివేదికలు రూపొందించడం దర్యాప్తు అధికారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని అన్నారు. అయితే సాంకేతికంగా వీటికి మరిన్ని సదుపాయాలు కల్పించడం ద్వారా డీసీఆర్బీల పనితీరును మరమరింతగా మెరుగు పరచడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామని అంజనీకుమార్ తెలిపారు.