Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం
- అధికారంలోకి రావడం ఖాయం
- బూత్ స్వశక్తీకరణ అభియాన్వర్క్షాప్లో బండి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంస్థాగతంగా బీజేపీయే బలంగా ఉందన్నారు. గురువారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో బూత్ స్వశక్తీకరణ అభియాన్ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, తమిళనాడు సహా ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలకు సంస్థాగతంగా బూత్ కమిటీలు లేవన్నారు.దేశంలోనూ సంస్థాగతంగా బీజేపీ బలంగా ఉందన్నారు. దేశంలో బీజేపీ హ్యాట్రిక్ ఫలితాన్ని సాధించబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ విజయాలతోపాటు స్థానిక సమస్యలను ప్రస్తావించడం ద్వారా ప్రజలకు బీజేపీ పట్ల నమ్మకం కలుగుతున్నదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకే మోడీ, బీజేపీనేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే సంస్థాగతంగా పూర్తి స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు.