Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్‌పై దాడి చేసిన నిందితులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌ను గురువారం భట్టి పరామర్శించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేందుకు హక్కు ఉందన్నారు. బీఆర్ఎస్ పాలన నియంతృత్వంగా ఉందని విమర్శించారు.