Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ శంషాబాద్ లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో గురువారం కస్టమ్స్ అధిక ారులకు పట్టుబడ్డారు. కస్టమ్స్ అధి కారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుడాన్ నుంచి షార్జా మీదుగా జి9-458 విమా నంలో తెల్లవారుజామున విమానా శ్రయానికి 23 మంది మహిళా ప్రయాణికులు వచ్చారు. అధి కారులు తనిఖీలు చేయగా.. లాగేజీల్లో బంగారం ఉన్నట్టు స్కానింగ్‌లో గుర్తించారు. బ్యాగుల నుంచి బంగారాన్ని బయటకు తీసి తూకం చేశారు. సుమారు రూ.7 కోట్ల 89 లక్షల విలువైన 14 కిలోల 906.3 గ్రాముల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. వెంటనే కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలు బంగారాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.