Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ : ప్రముఖ క్లాసికల్ డాన్సర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కనక్ రెలే (85) గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె కొన్నిరోజుల క్రితం గుండెపోటుకు గురై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, గురువారం ఉదయం చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. కనక్ రెలే మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సినీనటి హేమామలిని, నృత్య కళాకారిణి సుధాచంద్రన్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
గుజరాత్‌కు చెందిన కనక్ 1937లో జూన్ 11వ తేదీన జన్మించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆమె.. పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. అలాగే మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం చదివారు. ఇక ముంబయి విశ్వవిద్యాలయంలో నృత్యంలో పీహెచ్డీ చేశారు. ఈమె భారతదేశపు అత్యంత సృజనాత్మక శాస్త్రీయ నృత్యకారులలో ఒకరిగా పేరు పొందారు. ఆమె నలంద నృత్య కళా మహావిద్యాలయ వ్యవస్థాపకురాలు. శాస్త్రీయ నృత్యానికి ఆమె చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది.