Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ:విద్యుత్ పంపిణీ సంస్థలు పూర్తిగా గాడి తప్పాయి. ఆర్థిక నిర్వహణ సరిగా లేదు. అసంబద్ధ నిర్ణయాలతో ప్రజలపై భారాలు మోపుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌రంగం మొత్తానికి ఒకే సీఎమ్‌డీ ఉండేవారు. ఇప్పుడు 8 మంది ఉన్నారు. వాళ్లకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. అంతర్గత సామర్ధ్యం పెంపు పేరుతో క్షేత్రస్థాయిలో అనేక విభాగాల్లోని కార్మికులకు పీస్ రేటు, గంటల రేటు పేరుతో కేవలం రూ.4వేల నుంచి రూ.5వేల మధ్యే జీతాలు ఇస్తున్నారు. ఇదేనా అంతర్గత సామర్థ్యం పెంచుకోవడం అంటే? నిర్వహణ నష్టాలన్నింటినీ వ్యవసాయ ఉచిత విద్యుత్‌లో కలిపేసి అధికారులుచేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయం చాలాసార్లు ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లాం. తాత్కాలిక ఆదేశాలు ఇచ్చినట్టు చేస్తున్నారే తప్ప, అవి అమలయ్యాయో లేదో తిరిగి సమీక్షలు కూడా చేయట్లేదు.