Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 53, 85,071 మంది కంటి పరీక్ష లు చేయించుకున్నారని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ శుక్ర వారం ఒక ప్రకటలో తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమంలో నేటి వరకు 9, 93,461 మందికి కంటి అద్దాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు: 1,98,006, రీడింగ్ గ్లాసెస్ పంపిణీ 25,507, ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్ 19,132 కంటి సమస్యలు లేని వారు 1,53,365 మందిగా నిర్దారించారని తెలిపారు.కంటివెలుగులో ఇప్పటి వరకు.. మొత్తం కంటిపరీక్షలు 53,85,071 మంది కాగా, మొత్తం రీడింగ్ గ్లాసెస్ పంపిణీ 9,93,461,ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్ 6,93,644, కంటి సమస్యలు లేనివారు 36,97,858 మంది ఉన్నారని తెలిపారు.