Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలి : అధికారులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దిశానిర్ధేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వేసవిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం దిశానిర్దేశాన్ని చేశారు.
బస్టాండుల్లో తాగునీరు సదుపాయంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్యాన్లు, కూలర్లు, బెంచీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేసవిలో ప్రయాణికులకు ఏర్పాట్లు, సంస్థలోని ఇతర అంశాలపై హైదరాబాద్ లోని బస్ భవన్ నుంచి ఆర్ఎంలు, డీఎంలు, ఉన్నతాధికారు లతో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆన్లైన్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రయాణి కులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిర్ధేశించారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే కాలంలో టీఎస్ఆర్టీసీకి ఎంతో కీలకమనీ, ఆ మేరకు అధికారులందరూ పూర్తిగా సన్నద్ధం కావాలని తెలి పారు.
సంస్థ ఆర్థిక పుష్టికి పాటుపడాలని పిలుపు నిచ్చారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించడమే తమ ప్రధాన విది అóని పేర్కొన్నారు.