Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ లోకల్ అథారిటీ ఎమ్మెల్సీ, మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరా బాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు వేసిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా శుక్ర వారం పరిశీలించారు. హైదరా బాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు నామినేషన్లు వేయగా.. అందులో ఇండిపెం డెంట్ అభ్యర్థిగా మహమ్మద్ రహీంఖాన్ దాఖలు చేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ పత్రాలలో బలపరిచిన పదిమంది ఓటర్లు కానందున తిరస్కరించినట్టు అధికారి తెలి పారు. మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 21 మంది నామినేషన్లలో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదన్నారు.
టీచర్ ఓటర్లు 29,720మంది : ఎన్నికల సంఘం
మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి నియోజకర్గంలోని ఓటర్ల సంఖ్యను గతేడాది డిసెంబర్ 30న ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ జాబితాలో కొత్తగా ఓటర్ల నమోదు, తొలగించినవారు, ఇతర అంశాల ఆధారంగా తుది జాబితాను శుక్రవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో 137 పోలింగ్ కేంద్రాల పరిధిలో 29,720 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 15,472, మహిళలు 14,246, ఇతరులు ఇద్దరు ఓటర్లుగా ఉన్నారు. ఆ ఇద్దరు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఉన్నారు. అత్యధి కంగా రంగారెడ్డి జిల్లాలో 9,186 మంది, అత్యల్పంగా నారాయణపేట్ జిల్లాలో 664 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాల వారీగా టీచర్ ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.