Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు హెచ్ఆర్డీఏ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రోగులకు మేలు కలిగేలా ఉస్మానియా ఆస్పత్రిని కొత్త సచివాలయానికి తాత్కాలికంగా మార్చాలని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ కె.మహేష్ కుమార్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఉస్మానియాకు కొత్త భవన నిర్మాణంతో పాటు పాతభవనాలను ఏమి చేయాలనే అంశాలపై నిర్ణయం తీసుకునేంత వరకు కొత్త సచివాలయాన్ని ఉపయోగించుకునేలా కేటాయించాలని కోరారు. ప్రస్తుతం తాత్కాలికంగా నిర్మించిన షెడ్లలో రోగులకు చికిత్స అందిస్తున్నారనీ, అన్ని వార్డులను కలిపివేయడంతో ఇరుకుగా, అసౌకర్యంగా ఉందని తెలిపారు. అక్కడి వాతావరణం రోగులకు, సిబ్బందికి ఇబ్బందికరంగా, అసౌకర్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి పాత, కొత్త భవనాల విషయంలో నిర్ణయం తీసుకోవడంలో వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పాత భవనాలను పాలన విభాగం కోసం వాడుకోవచ్చని సూచించారు.