Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ డీన్‌కు హెచ్ఆర్డీఏ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ల సమస్యలు పరిష్కరించాలని హెచ్ఆర్డీఏ డిమాండ్ చేసింది. ఈ మేరకు హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ కె.మహేష్ కుమార్ ఆ కళాశాల డీన్‌కు శనివారం లేఖ రాశారు. ఐదు నెలల నుంచి ఉపకారవేతం పెండింగ్‌లో ఉందనీ, ఆడ్మిషన్ ఆర్డర్ ఇవ్వలేదనీ, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తీసుకుంటున్న దాని కన్నా చాలా ఎక్కువగా ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.2.5 లక్షలు వసూలు చేస్తున్నారని తెలిపారు. హాస్టల్ వసతి కల్పించడం లేదనీ, ఎవరైనా పీజీ వసతి కోరితే, ఒక గదిలో ఇద్దరు ఉండేలా నెలకు రూ.15,000 వసూలు చేస్తున్నారనీ, ఇది పేద విద్యార్థులకు భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గుర్తింపు కార్డులివ్వలేదనీ, పీజీ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు గ్రంథాలయం, వర్క్‌షాప్స్, అకడమిక్ యాక్టివిటీస్, ఆరోగ్య సదుపాయాలు అందడం లేదని తెలిపారు.