Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఈ ఏడాది నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, లలిత కళలు, జానపద విజ్ఞానం మొదలగు అంశాలతో విద్యాత్మక, కళాత్మక లక్ష్యాలతో విశ్వవ్యాప్త వికాసానికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ 1985 సంవత్సరం లో రాష్ట్ర శాసనసభ ప్రత్యేక చట్టం ద్వారా డిసెంబర్ 6న తెలుగు విశ్వ విద్యాలయానికి అంకురార్పణ చేశారు. అనంతరం 1996లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాల యంగా మారి తెలుగు భాష, సాహిత్య, చరిత్ర, లలిత కళల విద్యావిషయక కోర్సులను బోధిస్తూ, పరిశోధన, ప్రచురణ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ, అరుదైన విజ్ఞాన ప్రాంగణంగా భాసిల్లుతూ దేశంలోనే సాంస్కృతిక విశ్వ విద్యాలయంగా ప్రత్యేకతను చాటుకుంటు న్నది. గతంలోని సంగీత, నాటక, సాహిత్య, లలితకళా అకాడమీలను రద్దుపరచి తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేసి తద్వారా ఎందరో ప్రతిభామూర్తులను కళారంగానికి పరిచయం చేయాలనే సంకల్పానికి శ్రీకారం చుట్టిన మహానటుడు ఎన్టీఆర్. ఆయన ఆశ యసిద్ధి దిశగా తెలుగువర్శిటీ పయనిస్తున్నది.
ఈ ఏడాది ఆయన శతజయంతి సందర్భంగా వారిపట్ల తెలుగు విశ్వవిద్యాలయానికి ఉన్న గౌరవంతో వారి ఆ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య టి కిషన్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 10న తెలుగువర్సిటీ వరంగల్లోని జానపద, గిరిజన అధ్యయన పీఠం, దాక్షిణాత్య జానపద విజ్ఞాన సంస్థ (ఫాజిల్స్) సంయుక్త ఆధ్వర్యంలో 'జానపద గిరిజన అధ్యయనం సమస్యలు పరిష్కారాలు' అనే అంశంపై నిర్వహించే జాతీయ సదస్సులో పాల్గొని, పత్ర సమర్పణ చేసేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తెలుగుశాఖ ఆధ్వర్యంలో 'తెలుగు భాష సాహిత్య ఔన్నత్యం స్థితిగతులు-తెలుగు మాధ్యమాల ఆవశ్యకత' అనే అంశంపై ఉభయ రాష్ట్రాల భాషావేత్తలతో సదస్సును ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరా బాద్లోని లలితకళాక్షేత్రంలోని లలితకళా పీఠంలో 1985 నుంచి వివిధ కోర్సుల్లో విద్యనభ్యసించిన పూర్వవిద్యార్థులతోపాటు ప్రస్తుత విద్యార్థులను కలిపి సాహిత్యం, సంగీతం, నృత్యం, జానపదం, చిత్రలేఖనం, శిల్పం తదితర అంశాల్లో పోటీలను నిర్వహిస్తా మని తెలిపారు. విజేతలకు నగదు పురస్కారా లను అందజేస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించు కుని తెలుగు విశ్వవిద్యాలయాన్ని మరింత విస్తరిం పజేస్తూ నగర శివారులోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అధునాతన భవన సముదాయంలోనికి త్వర లోనే మారబోతున్నామని వివరించారు.