Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టీఏపీఆర్పీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. టీఏపీఆర్పీఏ అధ్యక్షులు పాలకుర్తి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి మచ్చా రంగయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం లోపభూయిష్టంగా తయారైం దని తెలిపారు. నగదు రహిత వైద్యం ఎక్కడా అమల్లో లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ పెన్షనర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.తొ మ్మిది వేలు పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సెంట ర్లను వరంగల్, నిజామాబాద్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. ఆ సంఘం నాయకులు సీతా రాం, అరుణ, రామ్మోహన్రావు, వైకుంఠం, సుజావతి, గడ్డం అశోక్ పాల్గొన్నారు.