Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదిలాబాద్‌లో సీసీఐ పునరుద్ధరించకపోవడం శోచనీయం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పరిశ్రమలను తెరిపిస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ప్రధాని మోడీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి అమ్ముకుంటున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమను తెరిపించేందుకు అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపడం లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాయితీలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధపడకపోవడం దారుణమ న్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవనంలో సోమవారం ఆ పార్టీ జిల్లా ప్లీనం సమా వేశాన్ని పార్టీ సీనియర్ నాయకులు లంక రాఘవులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి వీరయ్య హాజరై మాట్లాడారు. కేంద్రం తప్పుడు విధానాలతో సీసీఐ మూతపడిందని తెలిపారు. నిర్మాణ రంగం పెద్ద ఎత్తున విస్తరించిందని సిమెంట్‌కు కూడా భారీగా డిమాండ్ ఉందని వివరించారు. అయినప్ప టికీ కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయని రైల్వే ట్రాక్, జాతీయ రహదారితో పాటు వందేండ్లకు సరిపడా లైమ్‌స్టోన్ నిల్వలు ఉన్నాయన్నారు. ఈ పరిశ్రమ ప్రారంభమైతే పారిశ్రామికంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఈ పరిశ్రమను తెరిపించేం దుకు కార్మిక కుటుంబాలు, జిల్లావాసులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిం చారు. అంతకు ముందు అన్యాక్రాంతమవుతున్న సీసీఐ పరిశ్రమ భూములను పార్టీ నాయకులు, భూములు కోల్పోయిన రైతులతో కలిసి పరిశీలిం చారు. ఈ భూములను పరిరక్షించాలని, అక్రమ లే అవుట్లు వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, తొడసం భీంరావు, జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకుడు బండి దత్తాత్రి, నాయకులు అన్నమోల్ల కిరణ్, ఎం.గంగన్న, బొజ్జ ఆశన్న, మంజూల, పూసం సచిన్ తదితరులు పాల్గొన్నారు.