Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు
- ఆదాయపన్నుల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
సంపన్నులకు పన్ను రాయితీలను రద్దు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు డిమాండ్ చేశారు. సంపన్ను లకు రాయితీలు ఇచ్చి సామాన్యులపై పన్నులు వేసే కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త నిరసనలో భాగంగా సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని ఆదాయపన్నుల శాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీ నరసింహా రావు, నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, కార్యదర్శి వర్గసభ్యులు నాగలక్ష్మి, మహేందర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంపన్నులకు లక్షల కోట్ల రాయితీలిస్తూ ఆహార పదార్థాలు, మెడిసిన్స్‌పై జీఎస్టీ విధించే విధానాలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. దేశంలో అతి సంప న్నులు పెరిగిపోతున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పన్ను మినహా యింపులిస్తున్నదని, ఆ పన్ను మినహాయిం పులను రద్దు చేయాలని, సంపద పన్ను విధించాలని డిమాండ్ చేశారు. ఆహార సరుకులు, నిత్యవసరాలు, ఔషధాలపై జీఎస్టీ విధించడం కారణంగా సామాన్యులకు తీవ్రమైన భారంగా మారుతున్నదని, తక్షణమే వీటిపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిం చారని.. తక్షణమే కేటాయిం పులు పెంచాలని, కూలీ రేట్లు పెంచాలని కోరారు. రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యంతో పాటు 5 కేజీల సబ్సిడీ బియ్యం కూడా కొనసాగించాలని, పేదలకు ఆహార భద్రత పెంచేలా చర్యలు చేపట్టాలని అన్నారు. దేశ సంపదను కొల్లగొడుతూ, కుంభకో ణాలకు పాల్పడుతున్న అదానీ వ్యవహారంపై విచా రణ జరపాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరో స్వాతంత్ర పోరాటం తప్పదని వక్తలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, ఎం.దశరథ్, కేఎన్.రాజన్న తదితరులు పాల్గొన్నారు.