Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నగరంలోని సర్ధార్ వల్లభారు పటేల్ జాతీయ పోలీసు అకాడమీ ఇన్చార్జి డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలుగు రాష్ట్రాలకు చెందిన అమిత్‌గార్గ్ ను నియమించారు. ప్రస్తుతం ఎన్‌పీఏలోనే ఆయన అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్పీఏ డైరెక్టర్‌గా ఉన్న తమిళనాడు కేడర్‌కు చెందిన ఎ స్.రాజన్ శనివారం పదవీ విరమణ చేశారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ మెరుపు దాడులు
కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం
నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఇన్కమ్ టాక్సు అధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. దిల్షుక్నగర్ లోని గుగి రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు మరో నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీలపై హైదరాబాద్ చుట్టు ప్రక్కల ప్రాం తాల్లోని సదరు కంపెనీలకు చెందిన కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులను నిర్వహించారు. దాదాపు 25 మందితో కూడిన ఐటీ అధికా రులు సోదాలను నిర్వహించారు. గత ఐదేండ్ల కాలంలో సదరు కంపె నీలు చెల్లించిన ఐటీ రిటర్స్‌ను పరిశీలించిన అధికారులు అందులో చాలా వరకు తారతమ్యాలు ఉన్నట్టు గుర్తించి వాటి ఆధారంగానే తాజా సోదాలేని నిర్వహించినట్టు తెలిసింది. ఈ సంధర్భంగా ఐదు రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి విలువైన డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.