Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలంటూ ఈనెల ఎనిమిదో తేదీన పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనునాయక్, కార్యవర్గ సభ్యులు నరేష్, హరీశ్, భాను, కోటేష్, ఇర్ఫాన్, చంద్రశేఖర్రెడ్డి, మౌనిక, కవిత, స్వప్న మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ ఖాళీలకు ఆర్థిక శాఖ వెంటనే అనుమతిచ్చి, టీఆర్టీ నోటిఫికేషన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది జూన్ 12న టెట్ నిర్వహించి తొమ్మిది నెలలు గడిచిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలిపారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులంటూ కాలయాపన చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందని వివరించారు. అది పూర్తయ్యేసరికి మరింత ఆలస్యమవుతుందని తెలిపారు. దీంతో ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.