Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా ఎజీ సంజీవరావును కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం జీవో నెంబరు 79ని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయా జారీ చేశారు. సంజీవరావు 2021, ఫిబ్రవరి 28న రిటైరైన నేపథ్యంలో, ఆయన సర్వీసును 2021 మార్చి ఒకటి నుంచి మంగళవారం వరకు పొడిగించారు. ఇది రెండోసారి. ఇప్పుడు మరోసారి ఆయన సేవలను కొనసాగిస్తూ ఆదేశాలు ఇవ్వడం పట్ల పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈఎన్సీ సంజీవరావు 'నవతెలంగాణ'తో మాట్లాడుతూ ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా తన బాధ్యతలను నిర్వహిస్తానని చెప్పారు. మరింత చురుగ్గా శాఖను ముందుకు తీసుకెళతానని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం పీఆర్ రోడ్ల నిర్మాణం, నిర్వహణ చేపడతామని వివరించారు.