Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో సీఎం స్వయంగా పాల్గొంటారు. అనంతరం ఇక్కడే ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు హాజరవుతారు. బ్రహ్మోత్సవంలో పాల్గొన్న అనంతరం బాన్సువాడ నుంచి సీఎం బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారని సీఎంవో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాదాపు రెండున్న గంటల పాటు సీఎం పర్యటన కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో బాన్సువాడ పట్టణంతో పాటు, ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను సీఎం ప్రత్యేక వ్యక్తిగత రక్షణ బందం, డాగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. కతజ్ఞత సభ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు వేదికను సిద్ధం చేస్తున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.